Friday, May 3, 2024

Sri Ram Navami procession: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

శ్రీరామ‌న‌వమిని పుర‌స్క‌రించుకొని శ్రీరామ శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 నుండి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. శ్రీరామ‌న‌వమిని పుర‌స్క‌రించుకొని భాగ్య‌న‌గ‌ర్ శ్రీరామ‌న‌వ‌మి ఉత్స‌వ స‌మితి ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర చేప‌ట్ట‌నున్నారు. సీతారాంబాగ్ ద్రౌప‌ది గార్డెన్స్ నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు శోభాయాత్ర మొద‌లై.. రాత్రి 8 గంట‌ల‌కు సుల్తాన్ బ‌జార్ చేరుకోనుంది. శోభాయాత్ర సీతారాం బాగ్ టెంపుల్, బోయిగూడ క‌మాన్, గాంధీ విగ్ర‌హం, బేగంబ‌జార్, సిద్ధంబ‌ర్ బ‌జార్, శంక‌ర్‌షేర్ హోట‌ల్, గౌలిగూడ‌, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బ‌జార్ చేరుకోనుంది. ఈ నేప‌థ్యంలో ఈ మార్గంలో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు చేప‌ట్టారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పోలీసుల‌కు వాహ‌న‌దారులు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement