Saturday, April 27, 2024

సోనియా గాంధీకి శ్వాస‌కోశ ఇన్ఫెక్ష‌న్‌

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు ఈనెల 1వతేదీ నిర్వహించిన పరీక్షలో కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ శ్వాస‌కోశ ఇన్ఫెక్ష‌న్‌తో పాటు పోస్ట్ కొవిడ్ ల‌క్ష‌ణాల‌కు చికిత్స పొందుతున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. క‌రోనా వైర‌స్ సోక‌డం, ముక్కు నుంచి ర‌క్త‌స్రావం కావ‌డంతో జూన్ 12న సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం ఆస్ప‌త్రిలో చేరారు. సోనియాకు ఆస్ప‌త్రిలో వైద్యులు స‌ర్జరీ నిర్వ‌హించారు.

ఇదిలా ఉండగా… నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి జూన్ 23న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) స‌మ‌న్లు జారీ చేసింది. ఇదే కేసులో ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ఈడీ గ‌త మూడు రోజులుగా ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement