Thursday, May 16, 2024

డాల్బీ సినిమాతో కలిపి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్

ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అన్నీ ప్ర‌త్యేక‌త‌లే..స్టార్ డైరెక్ట‌ర్..స్టార్ యాక్ట‌ర్స్..పాన్ ఇండియా మూవీగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో తెర‌కెక్క‌నుంది. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ , కోమురంభీంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరితో పాటు బాలీవుడ్ యాక్టర్లు అజయ్ దేవ్ గన్, అలియాభట్ నటిస్తున్నారు. జనవరి నెలలోనే ఈ సినిమా విడుదల చేయాల్సి ఉన్నా… కరోనా, ఓమిక్రాన్ మళ్లీ తీవ్రరూపు దాల్చడంతో విడుదలను వాయిదా వేశారు ఫిలిం మేకర్స్అ యితే ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సినిమా గురించి ఓ కీలక ప్రకటన చేసింది. మంచి క్వాలిటీ సినిమా చూసిన అనుభూతిని పొందేలా డాల్బీ సినిమా తో కలిపి ఆర్ఆర్ఆర్ మూవీని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇలా విడుదలవుతున్న తొలి భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్ మాత్రమేనని ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని విడుదల చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement