Monday, May 20, 2024

కేర‌ళ‌కు రెడ్ అల‌ర్ట్.. ఇవ్వాల రేపు భారీ వ‌ర్షాలు..

ఈశాన్య రుతుప‌వ‌నాల తిరోగ‌మ‌నం.. బంగాళాఖాతంలో ఏర్ప‌డుతున్న వ‌రుస వాయుగుండాలు, అల్ప పీడ‌నాల‌తో ప‌లు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్న‌టిదాకా కురిసిన ఎడ‌తెరిపిలేని వాన‌ల‌కు చెన్నై సిటీ విల‌విల్లాడింది. అయితే మరో తుపాన్ గండం పొంచి ఉందనే సమాచారంతో ప్ర‌జ‌లు మ‌రింత భ‌యాందోళ‌న చెందుతున్నారు.

అయితే.. ఈసారి కేర‌ళ‌కు రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది India Meteorological Department (IMD). ఇవ్వాల రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కేరళ రాష్ట్రాన్ని హెచ్చరించింది. తిరువనంతపురానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు. తిరువనంతపురంలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement