Thursday, May 16, 2024

రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా – రూ.3 వేల కోట్ల బంగారం, వెండి అమ్మకాలు

ఎన్నడు లేనంతగా బంగారం అమ్మకాలు జరిగాయి. కర్వా చౌత్వే డుక నాడు బంగారం అమ్మకాలు భారీగా సాగాయి. ఈ వేడుక సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు రూ.3 వేల కోట్ల బంగారం, వెండి అమ్మకాలు జరిగినట్టు సీఏఐటీ, ఏఐజేజీఎఫ్ డేటాలు పేర్కొన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు 36 శాతం పెరిగినట్టు తెలిసింది. ట్రేడర్స్ బాడీ ఆఫ్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT), ఆల్ ఇండియా జ్యూవెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (AIJGF) రెండు కలిసి ఈ జాయింట్ ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటనలో గతేడాది కర్వా చౌత్ నాడు రూ.2,200 కోట్ల గోల్డ్, సిల్వర్ జ్యూవెల్లరీ అమ్మకాలు జరిగితే.. గురువారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా రూ.3 వేల కోట్ల అమ్మకాలు నమోదైనట్టు పేర్కొన్నాయి.

అక్టోబర్, నవంబర్ నెలలు బంగారం వర్తకుల కు ఎంతో ముఖ్యమైన నెలలని. కర్వా చౌత్, ఆ తర్వాత పుష్య నక్షత్ర, ధన్‌తేరాస్, లక్ష్మి పూజ, దీపావళి, భాయ్ దూజ్, ఛట్ పూజ, తులసి వివాహ్ వంటి వాటిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ పండగ సమయాల్లో సాధారణంగా అమ్మకాలు పెరుగుతూ ఉంటాయి’’ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖాండేల్‌వాలా, ఏఐజీజేఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా చెప్పారు. తేలికపాటి జ్యూవెల్లరీని ప్రజలు ఎక్కువగా కొనారని అన్నారు. అలాగే ఫ్యూషన్ జ్యూవెల్లరీ, ట్రెడిషనల్ గోల్డ్‌ను కూడా కొన్నట్టు పేర్కొన్నారు.ఈ ఫెస్టివల్స్ సందర్భాల్లో దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గి ఉన్నాయి. ధరలు తగ్గడం కూడా అమ్మకాలు పెరిగేందుకు సాయపడుతుంది. నేడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46,750గా నమోదవుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51వేలు వద్ద ఉంది. నిన్న, ఈ రోజు రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు మారలేదు. ఈ రేట్లు స్థిరంగా సాగుతున్నాయి. బంగారం ధర స్థిరంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో వెండి రేటు రూ.200 దిగొచ్చి కేజీ రూ.62,300గా నమోదైంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 వద్ద, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51 వేలు వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ రేట్లు స్థిరంగా ఉన్నాయి. అక్కడ కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.46,900 వద్ద, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,150 వద్ద రికార్డయ్యాయి. ఢిల్లీలో సిల్వర్ ధర కేజీ రూ.57,300గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement