Tuesday, April 30, 2024

ఇరు దేశాల మ‌ధ్య శాంతి నెల‌కొల్పేందుకు సిద్ధం – చైనా అధ్య‌క్షుడు జీ జిన్ పింగ్

చ‌ర్చ‌ల ద్వారా త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని ర‌ష్యా, ఉక్రెయిన్ ల‌కు చైనా స‌ల‌హా ఇచ్చింది. ఈ మేర‌కు చైనా అధ్య‌క్షుడు జీ జిన్ పింగ్ కాసేప‌టి క్రితం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల‌ చేశారు. చ‌ర్చ‌ల ద్వారానే ర‌ష్యా, ఉక్రెయిన్లు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని చెప్పిన జిన్ పింగ్‌.. ఇరు దేశాల మ‌ధ్య శాంతిని నెల‌కొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని కూడా ప్ర‌క‌టించారు. ఇదిలావుంచితే, ఉక్రెయిన్‌పై ఇప్ప‌టికే భీకర దాడుల‌కు రష్యా పాల్ప‌డుతోంటే..ఆ దాడుల‌ను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ కూడా హోరాహోరీగానే పోరాడుతోంది. ఇలాంటి స‌మ‌యంలో చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ ఇరు దేశాల మ‌ధ్య శాంతి నెల‌కొల్పేందుకు సిద్ధ‌మంటూ ప్ర‌కట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు..యుద్ధం జ‌రుగుతున్న వేళ చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో కొన‌సాగుతున్న సంక్షోభ ప‌రిస్థితుల‌పై పుతిన్‌తో జిన్ పింగ్ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement