Wednesday, May 1, 2024

మార్చి 25న థియేట‌ర్ల‌లో రామారావు ఆన్ డ్యూటీ ..

వ‌రుస‌గా ఐదు ప్రాజెక్ట్ ల‌ను అనౌన్స్ చేసి అంద‌రికీ షాక్ ఇచ్చాడు మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌. కాగా ర‌వితేజ 67వ సినిమా ర‌మేష్ వ‌ర్మ డైరెక్ష‌న్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. కాగా 68వ సినిమా డైరెక్ట‌ర్ త్రినాథ్ రావు తెర‌కెక్కిస్తున్న ధమాకా చిత్రం కూడా షూటింగ్ దశలో ఉంది. కాగా రవితేజ 69వ సినిమా శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. మార్చి 25 వ తేదీన థియేట‌ర్ల‌లో రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్ర బృందం.

Advertisement

తాజా వార్తలు

Advertisement