Friday, May 3, 2024

‘రామానుజాచార్య’ గా బాల‌కృష్ణ – ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ఆ మ‌ధ్య‌కాలంలో వ‌రుస‌గా భ‌క్తిర‌స చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే పాండురంగ‌డు, శ్రీరామ‌దాసు, అన్న‌మ‌య్య చిత్రాలు తీశారు. కాగా ఇప్పుడు రామానుజాచార్య చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్రంలో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ని పోషించ‌నున్నార‌ట‌. ప్రస్తుతం ‘రామానుజాచార్య’ జీవితాన్ని సినిమాకి సరిపోయే కథగా మలిచే పనిలో జేకే భారవి ఉన్నార‌ట‌. గతంలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన భక్తి చిత్రాలకు ఆయన పనిచేశారు. స్క్రిప్ట్ సిద్ధమైన తరువాత ఈ సినిమాను గురించిన ఎనౌన్స్ మెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement