Friday, April 26, 2024

యూకేలో రామ‌న్న సెల్ఫీ క్రేజ్‌.. ప్లీజ్​, ప్లీజ్​ అంటూ ఎగబడుతున్న అభిమానులు

డైనమిక్ లీడర్, యూత్ ఐకాన్, టీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ అంటే విదేశాల్లో ఎంతో మంది లైక్ చేస్తారు. ఐటీ, పరిశ్రమల మంత్రిగానే కాకుండా వ్య‌క్తిగ‌తంగా కూడా రామ‌న్న అంటే సామాన్య ప్ర‌జ‌ల‌లు ఎంతో ఆప్యాయత చూపిస్తారు. అయితే లండ‌న్ టూర్‌లో ఉన్న కేటీఆర్‌కు అక్క‌డి ఎన్నారైలు కూడా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ‘‘కేటీఆర్‌కు ఉన్న‌ క్రేజ్ గురించి ఈ ఒక్క ఫొటో చూస్తే తెలిసిపోతుంది. లీడ‌ర్ అంటే కేటీఆర్‌లా ఉండాల‌ని..’’ అంటూ భ‌ద్రాచలానికి చెందిన కోటగిరి ప్రబోధ్ కుమార్ త‌న ట్విట్ట‌ర్‌లో ఈ ఫొటోని పోస్టు చేశాడు. ఇప్పుడిది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement