Monday, April 29, 2024

ఫిన్​లాండ్​లో వెకేషన్​ ఎంజాయ్​ చేస్తున్న రామ్​చరణ్​, ఉపాసన.. చాన్నాళ్ల తర్వాత జాలీగా..

మెగా పవర్​ స్టార్​ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కామినేని ఫిన్‌లాండ్‌లో ఎంజాయ్​ చేస్తున్నారు. RRR మూవీతో ఇంతకాలం ఫ్యామిలీకి దూరంగా ఉన్న చరణ్​.. ఇప్పుడు దొరికి కాస్త ఖాళీ టైమ్​ని తన భార్యతో సద్వినియోగం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తన టూర్​ కు సంబంధించిన ఫొటోలతో Instagram స్టోరీస్​లో రాసుకొచ్చాడు చరణ్​. చలిని తట్టుకోవడంతో ఇద్దరూ దట్టమైన దుస్తులు ధరించడం ఆ ఫొటోల్లో చూడవచ్చు.

ఇక .. ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో ఫిన్‌లాండ్ గురించి అప్​డేట్​ ఇచ్చారు. రెండేళ్ల తర్వాత తాము వెకేషన్‌కు వెళ్తున్నామని ఆమె వెల్లడించారు. మార్చి 6న రామ్ చరణ్, ఉపాసన హాలీడేకి బయలుదేరి ఎయిర్‌పోర్ట్ లో కనిపించారు. ఆ సమయంలో ఈ జంట తాము ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాన్ని వెల్లడించలేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వారు రెండేళ్లుగా ఎటువంటి టూర్స్​ ప్లాన్​ చేయలేదు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement