Tuesday, April 16, 2024

రాజమండ్రి చమురు క్షేత్రానికి అత్యాధునిక రిగ్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఓఎన్‌జీసీ రాజమండ్రి చమురుక్షేత్రానికి 2000 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న అత్యాధునిక ల్యాండ్‌ డ్రిల్లింగ్‌ రిగ్‌ను మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) సరఫరా చేసింది. దీంతో ఆయిల్‌రిగ్గుల సరఫరాను మేఘా సంస్థ వేగవంతం చేసినట్లయింది. రాజమండ్రి చమురు క్షేత్రానికి అతిపెద్ద ల్యాండ్‌ డ్రిల్లింగ్‌ రిగ్‌ సరఫరా చేసిన మేఘా… అత్యాధునిక రిగ్గుల తయారీలో తన శక్తిని చాటింది. ఈ చమురు క్షేత్రం ఉభయగోదావరి జిల్లాల్లోని చమురు, గ్యాస్‌ నిల్వలను కవర్‌ చేస్తోంది. దేశీయంగా తయారు చేసిన అత్యాధునిక ఆయుల్‌ రిగ్‌ ప్రపంచంలోని అన్ని రకాల ఉత్తమ ఫీచర్స్‌ ను కలిగి ఉన్నట్లు సంస్థ తెలిపింది. 3వేల హెచ్‌పీతో పనిచేసే సాంప్రదాయ రిగ్గుకన్నా ఇది అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తుందని , 6కి.మీ లోతు వరకు డ్రిల్లింగ్‌ చేస్తుందని పేర్కొంది. ఇప్పటి వరకు 10 ల్యాండ్‌ డ్రిల్లింగ్‌ రిగ్గులను మేఘా సరఫరా చేసింది.ఇందులో మూడు ఇప్పటికే పనిచేస్తున్నాయి. మిగిలిన మిషన్ల కమిషనింగ్‌ చివరి దశలో ఉంది.

మరోవైపు మెహసన, అంకలేశ్వర్‌, అగర్తలా, శిట్‌సాగర్‌ లలోని ఓన్‌ ఏసీ క్షేత్రాలకు 5 వర్క్‌ ఓవర్‌ రిగ్గులను మొదటి విడతగా సరఫరా చేశారు. మరోవైపు రెండో విడత రిగ్గుల తయారీ వేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మేఘా సంస్థ రిగ్‌ ఇన్‌చార్జి సత్యనారాయణ మాట్లాడుతూ… కొవిడ్‌ ముగింపుదశకు రావడంతో ఇచ్చిన హామీ మేరకు రిగ్గుల తయారీ, సరఫరాను వేగవంతం చేసినట్లు చెప్పారు. ఇంధన రంగంలో డౌన్‌ స్ట్రీీమ్‌, అప్‌స్ట్రీమ్‌ విభాగాల్లో కంపెనీ కీలక భూమిక పోషిస్తోందన్నారు.అత్యంత సమర్థమైన చమురు డ్రిల్లింగ్‌ రిగ్గులను తయారు చేస్తున్న మొదటి ప్రయివేటురంగ సంస్థగా మేఘా నిలిచిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement