Monday, April 29, 2024

రాజ్యసభ పోల్స్​: ఆరు రాష్ట్రాల్లో 13 సీట్లు ఖాళీ.. మార్చి 31న ఎన్నికలు..

ఖాళీ అవుతున్న ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు చెందిన సభ్యులు ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనుండగా, పంజాబ్‌కు చెందిన ఐదుగురు సభ్యులు ఏప్రిల్ 9న పదవీ విరమణ చేస్తున్నారు. ఆనంద్ శర్మ, ఎకె ఆంటోనీ, పర్తాప్ బజ్వా, నరేష్ గుజ్రాల్ వంటి ప్రముఖ నాయకులు రిటైర్ అవుతున్న వారిలో ఉన్నారు. పంజాబ్ నుండి భర్తీ చేయాల్సిన ఐదు సీట్లలో మూడింటిని ఒక ఎన్నిక ద్వారా, మిగిలిన రెండింటిని మరో ఎన్నిక ద్వారా భర్తీ చేయనున్నట్టు ఎలక్షన్​ కమిషన్ తెలిపింది.

ద్వైవార్షిక ఎన్నికలకు మార్చి 14న నోటిఫికేషన్ విడుదల చేసి 31న ఎన్నికలు నిర్వహించనున్నారు. పద్ధతి ప్రకారం పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నారు. పదవీ విరమణ చేస్తున్న సభ్యులలో ప్రముఖులు ఆంటోనీ (కేరళ), ఆనంద్ శర్మ (హిమాచల్ ప్రదేశ్), ప్రతాప్ సింగ్ బజ్వా, నరేష్ గుజ్రాల్ (పంజాబ్). మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, రాజ్యసభలో కాంగ్రెస్‌ ఉపనేత ఆనంద్‌ శర్మ, ప్రతాప్‌ బజ్వా కాంగ్రెస్‌ నుంచి, గుజారాల్‌ శిరోమణి అకాలీదళ్‌కు చెందిన వారు ఉన్నారు. పంజాబ్‌లో ఐదు సీట్లు ఖాళీగా ఉండగా, కేరళలో మూడు, అస్సాంలో రెండు, హెచ్‌పీ, నాగాలాండ్, త్రిపురలో ఒక్కొక్కటి చొప్పున ఖాళీ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement