Friday, April 26, 2024

కరోనా విలయం.. రాజస్థాన్ రాయల్స్ భారీ విరాళం!

దేశంలో కరోనా వైరస్ సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు కేసులు మూడు లక్షలపైనే నమోదు అవుతున్నాయి. అదే సమయంలో మరణాలు భారీగా పెరిగిపోయాయి. దేశంలోని ఆసుపత్రిలో ఆక్సిజన్‌ లభించక, బెడ్స్ దొరక్క బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ గొప్ప మనసు చాటుకుంది. తమ దేశ కరోనా బాధితుల కోసం 1 మిలియన్ డాలర్లు (దాదాపు 7.5 కోట్లు) సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. రాయల్స్ జట్టు యజమానులు, ఆటగాళ్లు, మేనేజ్మెంట్ కలిపి 1 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని రాయల్స్ తమ అధికారిక ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. రాయ‌ల్స్ టీమ్ ఇచ్చిన విరాళం మొత్తం దేశంలో స‌హాయ కార్య‌క్ర‌మాల‌కు వినియోగించ‌నున్నారు. రాయల్స్ ప్రాంచైజీపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement