Monday, April 29, 2024

అన్నాతై డైరెక్ట‌ర్ కి ర‌జ‌నీకాంత్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా

త‌మిళ సూప‌ర్ స్టార్ రీసెంట్ గా న‌టించిన చిత్రం అన్నాతై .. తెలుగులో పెద్ద‌న్న‌గా రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని శివ డైరెక్ట్ చేశాడు. కాగా ర‌జ‌నీకాంత్ కి జోడీగా న‌య‌న‌తార న‌టించింది. ర‌జ‌నీకాంత్ కి చెల్లెలిగా కీర్తి సురేశ్ న‌టించింది. ఇక మిగ‌తా పాత్ర‌ల్లో ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ తెలుగులో పెద్ద హిట్ కాక‌పోయిన త‌మిళంలో మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. కొన్ని రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా విడుదలైన అన్నాత్తె సినిమా అక్కడ కూడా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలో హ్యాపీగా ఫీలైన ర‌జ‌నీకాంత్‌.. శివ‌తో పాటు ఆయ‌న ఇంటి స‌భ్యుల‌ను త‌న ఇంటికి పిలిచార‌ట‌. మూడు గంట‌ల‌పాటు వారితో ముచ్చ‌టించాక గోల్డ్ చెయిన్‌ను బ‌హుమ‌తిగా అందజేశారట. దీంతో శివ కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగితేలుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement