Friday, May 3, 2024

TS: చల్లబడిన వాతావరణం.. తెలంగాణలో తెలికపాటి వర్షం

తెలంగాణలో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడింది. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్, అంబ‌ర్‌పేట‌, ఉస్మానియా యూనివ‌ర్సిటీ, రాంన‌గ‌ర్‌, ముసారాంబాగ్, మ‌ల‌క్‌పేట్‌, రామంతాపూర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, రాజేంద్ర‌న‌గ‌ర్, శంషాబాద్, శివ‌రాంప‌ల్లి, బంజారాహిల్స్, మాసాబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, మెహిదీప‌ట్నం, అత్తాపూర్, ఖైర‌తాబాద్ ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షం కురిసింది. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెద‌క్, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లో పిడుగులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement