Wednesday, May 15, 2024

Spl Story: పోర్న్ హబ్‌లుగా మారిన రైల్వే స్టేషన్లు.. పోర్న్ డౌన్​లోడింగ్​కే ప్రయాణికుల ఇంపార్టెన్స్​

దేశంలోని రైల్వేస్టేష‌న్లు పోర్న్ హ‌బ్స్‌గా మారుతున్నాయా? ఇక్క‌డ అందించే ఫ్రీ వైఫై తో చాలామంది పోర్న్ వీడియోల‌ను డౌన్‌లోడ్ చేస్తున్నారా? అంటే అవున‌నే చెబుతున్నారు టెక్ ఎక్స్‌ప‌ర్ట్స్‌. ఎందుకంటే సికింద్రాబాద్ వంటి అతిపెద్ద రైల్వే స్టేష‌న్ ఇప్పుడు పోర్న్ హ‌బ్‌గా మారింద‌ని చెబుతున్నారు. దీనికి డేటా మొత్తం ఖాళీ కావ‌డం ఒక కార‌ణ‌మైతే.. ఎక్కువ‌గా ఈ ఏరియాలో వీపీఎన్ స‌హాయంతో పోర్న్ సైట్స్ యాక్సెస్ కావ‌డం కూడా మ‌రో కార‌ణంగా తెలుస్తోంది. అంతేకాకుండా విజ‌య‌వాడ‌, టెంపుల్ సిటీ అయిన తిరుప‌తి వంటి చోట్ల కూడా పోర్న్ ఎక్కువ‌గా చూస్తున్నార‌ని టెక్ ఎక్స్‌ప‌ర్ట్స్ చెబుతున్నారు.

రైల్వే స్టేషన్లలో అత్యవసర ఉపయోగానికి వాడాల్సిన ఫ్రీ వైఫైని ప్యాసెంజర్లు పోర్న్ చూడ్డానికి ఉపయోగిస్తున్నారు. పోర్న్ డౌన్లోడ్తో మొత్తం డేటా ఖాళీ అవుతోంది. దీంతో ఎమర్జెన్సీ టైమ్లో ప్రయాణికులకు డేటా లభించడం లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే మరీ ఇదే పనిగా పోర్న్ చూస్తున్నట్టు తెలుస్తోంది. స్టేషన్కు వచ్చిన ప్రయాణికులు 30 నిమిషాలపాటు హైస్పీడ్ డేటాని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. ఇట్లాగే తిరుపతి, విజయవాడ రైల్వే స్టేషన్లలోనూ అందుబాటులో ఫ్రీ వైఫై ఉంది. అయితే.. ఇక్కడ కూడా డేటాని పోర్న్ చూడ్డానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కువగా వినియోగిస్తున్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు.

పోర్న్ సైట్స్ ఇండియాలో నిషేధించినా కొన్ని వెబ్సైట్ల ద్వారా మాత్రం అందుబాటులో ఉంటున్నాయి. 35శాతం పోర్న్ సైట్స్ డౌన్లోడింగ్ చేసుకునే చాన్స్ కల్పించాయి. దీంతో వందల జీబీల డేటాను ప్రయాణికులు వాడేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో వాడుదాం అనుకున్న వారికి మాత్రం డేటా లభించడం లేదు. వీపీఎన్ సహాయంతో పలు నిషేధిత సైట్లను యాక్సెస్ చేస్తున్నట్టు నెట్వర్కింగ్ నిపుణులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా 1600 రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై ఫెసిలిటీ కల్పించింది రైల్వే. దీంట్లో 90 శాతం పోర్న్ సైట్లను చూడ్డానికే ప్రయాణికులు డేటా మొత్తం వాడేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో కూడా పోర్న్ ఎక్కువగా చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే పోర్న్ హబ్గానే మారిందంటున్నారు నిపుణులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement