Monday, April 29, 2024

వారం రోజులు పూర్తి చేసుకున్న రాహుల్​ పాదయాత్ర.. భారత్​ జోడో యాత్రకు పెరుగుతున్న సపోర్ట్​

కాంగ్రెస్​ నేత, ఎంపీ రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవ్వాల్టికి (బుధవారం) మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లక్షలాది మందికి అధికారాన్ని అందించిన, బాపు & అంబేద్కర్ జీకి స్ఫూర్తిగా నిలిచిన విప్లవ సంఘ సంస్కర్త నారాయణ గురునికి రాహుల్​ అర్పించారు. ఇవ్వాల ఆయన శివగిరి మఠాన్ని సందర్శించారు.
– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర ఏడో రోజు పూర్తయ్యింది. వారం రోజులుగా రాహల్‌ పాదయాద్ర సాగుతోంది. ప్రస్తుతం కేరళలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు రాహుల్‌. త్రివేండ్రం శివార్ల లోని కనియాపురంలో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతోంది. వందలాదిమంది కార్యకర్తలు ఉత్సాహంగా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, కనీసం గొడుగు లేకుండానే రాహుల్‌ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో పాల్గొన్నవారి కాళ్లను బొబ్బలు వేధిస్తున్నప్పటికీ ముందుకు సాగుతున్నారు. రాహుల్‌ బృందానికి స్థానికుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.

వందల సంఖ్యలో స్థానికులు వచ్చి పాదయాత్రలో పాల్గొనడం కనిపిస్తోంది. దీంతో వారిని ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్‌.. విద్వేషం, హింసతో ఎన్నికల్లో గెలవవచ్చేమో కానీ, వాటివల్ల దేశం ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక సమస్యలు మాత్రం పరిష్కారం కావని అన్నారు. ఇక.. అన్నివర్గాల ప్రజలను పలుకరిస్తూ రాహుల్‌ గాంధీ ముందుకు సాగుతున్నారు.

సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో మొదలైన భారత్‌ జోడో యాత్ర.. సెప్టెంబర్ 10న కేరళకు చేరుకుంది. కేరళలో 19రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఇక్కడి ఏడు జిల్లాల్లో సుమారు 450 కి.మీ మేర సాగే రాహుల్‌ పాదయాత్ర.. అక్టోబర్‌ 1న కర్నాటకలోకి ప్రవేశించనుంది. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మొత్తంగా 150 రోజుల్లో 12 రాష్ట్రాల్లో 3500కి.మీ మేర కొనసాగతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement