Thursday, May 9, 2024

Resigns | టైమ్స్​ నౌ ఎడిటర్​ ఇన్​ చీఫ్​ రాజీనామా.. జర్నలిస్టు సర్కిళ్లలో ఇదే చర్చ

టైమ్స్​నౌ ఎడిటర్​ ఇన్​ చీఫ్​, ప్రైమ్​టైమ్​ న్యూస్​ యాంకర్​ రాహుల్​ శివశంకర్​ రాజీనామా చేశారు. ఇవ్వాల (మంగళవారం) ఆశ్చర్యకరంగా ఆయన తన రాజీనామాను చానెల్‌కు అందజేశారు. ది న్యూస్ మినిట్ నివేదిక ప్రకారం.. శివశంకర్ ఎడిటోరియల్ గ్రూప్‌తో సహా చానెల్‌లోని అన్ని వాట్సాప్ గ్రూపుల నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. శివశంకర్ ఆకస్మిక రాజీనామా, తన భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.  

కాగా, అర్నాబ్ గోస్వామి (ప్రస్తుతం రిపబ్లిక్ వరల్డ్ అధినేత) ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నప్పుడు 2005లో శివశంకర్ టైమ్స్ నౌలో చేరారు. 2013-2016 సమయంలో శివశంకర్ ఆ చానల్​ని వదిలేసి, న్యూస్ X లో ఎడిటర్-ఇన్-చీఫ్ గా చేరారు. అయితే.. 2016లో గోస్వామి టైమ్స్​ నౌ నుంచి వెళ్లిన తర్వాత అతను టైమ్స్ నౌకి మళ్లీ  తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది.  ఇక.. ఈ మధ్య కాలంలో ABP న్యూస్ ప్రైమ్‌టైమ్ న్యూస్ యాంకర్ రూబికా లియాఖత్ కూడా రాజీనామా చేశారు. తను భారత్24 వైస్ ప్రెసిడెంట్‌గా చేరడానికి ఆ చానల్​ నుంచి వెళ్లిపోయారు. త్వరలో ఆమె తన స్వతంత్ర యూట్యూబ్ చానెల్‌ని కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement