Wednesday, May 15, 2024

ఇంటి దొంగతో జాగ్రత్తగా ఉండండి!

తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో చేపట్టే దళిత దండోరా కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాల్గొంటారని టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. సెప్టెంబరు మొదటి వారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాంతం, తేదీ ఎక్కడ, ఎప్పుడు అనేది నిర్ణయించాల్సి ఉందని తెలిపారు. దళిత దండోరా కార్యక్రమంపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు చెప్పారు.

ఆగస్టు 9న ఇంద్రవెళ్లిలో దళిత, గిరిజన దండోరా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు పది రోజుల పాటు 5 మండలాలు, 2 మునిసిపాలిటీలు తీసుకొని ప్రతి రోజు ఒక ప్రాంతంలో 2, 3 వేల మందితో ర్యాలీలు, సమావేశాలు జరపాలని రేవంత్ సూచించారు. మండలంలో ఉన్న ఓట్లులో పది శాతం మీటింగ్ కు వచ్చేలా ప్రణాళిక చేయాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులను క్షేత్ర స్థాయిలో పని చేయించాలన్నారు. పార్టీ సమిష్టి నిర్ణయం మేరకే అన్ని పనులు జరుగుతాయని రేవంత్ స్పష్టం చేశారు. నాయకుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. నాయకులు చేసే సూచనలు ఖచ్చితంగా పాటించి పని చేయాలని కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కొంతమందిని కోవర్టు మార్చుకొని కేసీఆర్ రాజకియ లబ్ది పొందిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దు.. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని రేవంత్ వ్యాఖ్యానించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసిన కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.. అది తనతో సహా అని స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా పనులు చేస్తేనే గౌరవం పెరుగుతుందని, అందరూ అప్రమతంగా ఉండి పని చేయాలని రేవంత్ సూచించారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ పదవిపై రగులుతున్న గులాబీ సైన్యం!

Advertisement

తాజా వార్తలు

Advertisement