Saturday, May 4, 2024

రాధేశ్యామ్ ల‌వ్ ఆంథెమ్ రిలీజ్ .. ఎప్పుడో తెలుసా ..

ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ తెర‌కెక్కిస్తోన్న చిత్రం రాధేశ్యామ్..ఈ చిత్రంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, పూజాహెగ్డే జంట‌గా న‌టిస్తున్నారు. కాగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర టీం.ఈ చిత్రం నుంచి లవ్ ఆంథెమ్ ను రేపు విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసింది. . ఈ సాంగ్ టీజర్ ను రేపు సాయంత్రం 7 గంటల సమయంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అలాగే హిందీ టీజర్ ను 1:00 గంటలకు చేస్తామని ప్రకటించింది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement