Monday, April 29, 2024

Breaking: భార్య పుట్టింటికి వెళ్లిందన్న ఆక్రోశంతో సైకో వీరంగం… స్కార్పియో వాహనానికి నిప్పు

పెద్దపల్లిరూరల్, (ప్రభ న్యూస్): పెద్దపల్లి మండలం అందుగులపల్లి శివారులో తన వాహనానికి అతడే నిప్పంటిచి వీరంగం సృష్టించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బసంత్ నగర్ ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలం జీడీనగర్ పంచాయతీ పరిది బిసి కాలనీకి చెందిన అర్జున్ అలియాస్ ఆపిల్ ఓయువతిని ప్రేమ వివాహం చేసుకుని జీవిస్తున్నారు. ఇటీవలి భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. దీనితో అర్జున్ భార్య పుట్టింటికి వెళ్ళింది.

భార్య వెళ్లడంతో అర్జున్ మానసికంగా కుంగిపోయాడు. అదే ఆలోచనతో వింతగా ప్రవర్తించేవాడు. ఇదేక్రమంలో అతని స్క్వార్ ఫియో వాహనాన్ని అందుగులపల్లి పెద్దమ్మ ఆలయం వద్ద నిలిపి వాహనానికి నిప్పంటించాడు. మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. పోలీసులు ఈ ఘటనపై ఎంక్వైరీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement