Sunday, April 28, 2024

దంచికొట్టిన దినేశ్ కార్తీక్‌.. స‌న్‌రైజ‌ర్స్ ముందు భారీ టార్గెట్‌!

టాటా ఐపీఎల్ 2022లో భాగంగా ఇవ్వాల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. కాగా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు టీమ్‌.. స‌న్‌రైజ‌ర్స్‌కి భారీ టార్గెట్ పెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో చివ‌ర‌లో దినేశ్ కార్తీక్ దంచికొట్ట‌డంతో అనుకున్న దానికంటే రాయ‌ల్స్ స్కోరు మ‌రింత పెరిగింది.

ఇన్నింగ్స్ తో తొలి బంతికే విరాట్ కోహ్లీ డకౌట్ కాగా, 19 ఓవర్ పూర్తయ్యేసరికి బెంగళూరు స్కోరు 167 పరుగులుగా ఉంది.. అయితే.. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్‌ విశ్వరూపం ప్రదర్శించాడు.. కొత్త కుర్రాడు ఫజల్ హక్ ఫరూఖీ వేసిన ఆ ఓవర్లో దినేశ్ కార్తీక్ వరుసగా 3 భారీ సిక్స్ లు, 1 ఫోర్ కొట్టాడు. మొత్తమ్మీద ఆ ఓవర్లో 25 పరుగులు రాగా, బెంగళూరు స్కోరు అమాంతం పెరిగిపోయింది. దినేశ్ కార్తీక్ కేవలం 8 బంతుల్లోనే 4 సిక్స్ లు, 1 ఫోర్ సాయంతో 30 పరుగులు చేయడం విశేషం.

మరో ఎండ్ లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. రజత్ పాటిదార్ తో కలిసి డుప్లెసిస్ సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రజత్ పాటిదార్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు సాధించాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్ వెల్ సైతం బ్యాట్ ఝుళిపించడంతో బెంగళూరు స్కోరు 150 మార్కు దాటింది. మ్యాక్స్ వెల్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 33 పరుగులు చేసి కార్తీక్ త్యాగి బౌలింగ్ లో అవుటయ్యాడు. సన్ రైజర్స్ బౌలర్లలో జగదీశ సుచిత్ 2 వికెట్లు పడగొట్టగా, కార్తీక్ త్యాగి 1 వికెట్ తీశాడు. జమ్ము ఎక్స్ ప్రెస్ గా పేరుగాంచిన ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్ లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. 2 ఓవర్లు బౌలింగ్ చేసి 25 పరుగులిచ్చుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement