Thursday, May 2, 2024

30 మంది ఎస్సైలకు సీఐలుగా ప్రమోషన్‌.. కండిష‌న్స్ అప్ల‌య్‌!

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్) : 30 మంది సబ్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌కు పదోన్నతులు కల్పిస్తూ హైదరాబాద్ మల్టీ జోన్ వన్ ఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్స్ జాబితాలో ఎం.ప్రవీన్ రాజు (సిద్ధిపేట), రహీం పాషా (కరీంనగర్), బి.ప్రశాంత్ రాజు (కరీంనగర్), ఈ రమేష్ (ఆసిఫాబాద్), బి.ప్రణయ్ కుమార్ (రైల్వేస్), ఎల్.మంగీ లాల్ (మహబూబాద్), శేఖర్ సలెంకర్ (మెదక్), తోట లింగం (సిద్ధిపేట), ఎం డి రాఫీక్ ఖాన్ (సిరిసిల్ల), ఎస్ తిరుపతి ( భద్రాది కొత్తగూడెం) ఉన్నారు..

ఇక‌.. కె శ్రీధర్ (ఖమ్మం), వి.శివ్రరం (నిజామాబాద్), బి రవి కుమార్ (మహబూబాద్), బండారు సంపత్ (వరంగల్ ), జె ఆంజనేయులు (నిజామాబాద్), ఎన్ ఎస్ ప్రసాద్ (నిజామాబాద్), పి రవీందర్ (నిజామాబాద్), ఎన్ సురేష్ కుమార్ (మెదక్), పి. ప్రేమ్ కుమార్ (నిజామాబాద్), కె. దామోదర్ (పిటిసి,వరంగల్), ఎం.సంపత్ కుమార్ (సిద్ధిపేట), డి.రాజీ రెడ్డి (నిజామాబాద్), ఎస్ సందీప్ రెడ్డి (మెదక్), బి మహేందర్ (సిద్ధిపేట), రాసమల్ల సతీష్ కుమార్ (ఇంటిలిజెన్స్), పల్లె శ్రీధర్ గౌడ్ (సిద్ధిపేట), బి సంతోష్ కుమార్ (కామారెడ్డి), ఆర్ కృష్ణ (సిద్ధిపేట),గంగుల శ్రవణ్ కుమార్ (నిజామాబాద్) లకు పదోన్నతులు లభించాయి.

కాగా, ప్రమోషన్స్ పొందిన ఎస్సైల‌పై లోకల్ లో ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఉండి ఉంటే, అవి పరిష్కారం అయ్యే వరకు పదోన్నతులు నిలిచి పోతాయని ఈ ఆర్డర్ లో పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన వారు ఖాళీలను బట్టి పోస్టింగ్స్ దక్కుతాయని కూడ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement