Monday, May 20, 2024

ఆర్య‌వైశ్యుల‌కు ప్రాధాన్య‌త పెరిగింది – మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఆర్య వైశ్యులకు ప్రాధాన్యత పెరిగిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సమాజానికి సమయం ఇచ్చి సమాజ హితం కోసం పాటుపడే వారు ఆర్య వైశ్యులు అన్నారు. నేడు మహబూబాబాద్ లో ఆర్య వైశ్య మహాసభ, మహబూబాబాద్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై కొత్త సభ్యులకు మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజానికి సమయం ఇచ్చి ..సమాజ హితం కోసం పాటుపడతామని ప్రతిజ్ఞ చేసిన ఆర్య వైశ్య మహాసభ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్య వైశ్యులు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారన్నారు. సీఎం కేసిఆర్ ఇచ్చిన చేయూత వల్ల మంచి గుర్తింపు, గౌరవం లభించిందని తెలిపారు. ఆర్య వైశ్యులకు నాలుగు కార్పొరేషన్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ పదవులు ఇచ్చారు. ఇంత ప్రాధాన్యత ఇచ్చిన కేసిఆర్ కి ఆర్యవైశ్యులు అండగా నిలబడాలని..ఆర్య వైశ్యులకు జిల్లాలో అన్ని విధాలా అండగా మేము కూడా ఉంటామ‌న్నారు. ఇప్పటికే సీఎం ఆర్య వైశ్య మహాసభకు 5 ఎకరాల స్థలం ఇచ్చారు. జిల్లాలో కూడా స్థలం ఇచ్చి, భవన నిర్మాణానికి కూడా తోడ్పాటు ఇస్తామ‌న్నారు. మంత్రితో పాటు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఆర్య వైశ్య మహా సభ అధ్యక్షులు, టి.ఎస్. ఎం. ఐ. డి.సి చైర్మన్ అమరవాది లక్ష్మీ నారాయణ, తెలంగాణ చేతి వృత్తుల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్, ఇతర నేతలు హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement