Sunday, May 5, 2024

తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రసంగంలో భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ప్రస్తావించారు. భాగ్యలక్ష్మీ నగరాన్ని వెంకన్న నగరంతో కలిపామన్నారు. తెలంగాణ అభివృద్ధిని మరింత వేగవంతం చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. తెలంగాణ, ఏపీని కలిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించామన్నారు. రూ.11000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానన్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడినప్పుడు తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ పోరాటంలో సామాన్య ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉన్నామన్నారు. ఎంఎంటీఎస్ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేశామన్నారు. ఎంఎంటీఎస్ విస్తరణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు బడ్జెట్ కేటాయించామన్నారు. ఎంఎంటీఎస్ ద్వారా లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement