Sunday, May 5, 2024

LPG cylinder: గ్యాస్ వినియోగదారులకు షాక్.. రూ.104 పెరిగిన సిలిండర్‌ ధర

దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై పెట్రోలియం సంస్థలు మరోసారి భారం మోపాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్‌పై భారీగా వడ్డించాయి. నెలవారీ సమీక్షలో భాగంగా ఒకేసారి రూ.104 పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.2460 నుంచి రూ.2563.5కి పెరిగింది. గత నెల ఏప్రిల్ 1న వాణిజ్య సిలిండర్‌పై రూ.268 పెంచాయి. తాజాగా మరో రూ.104 పెరగడంతో రెండు నెలల్లోనే రూ.372 ప్రజలపై భారం మోపాయి. అయితే గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధర పెరగకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement