Sunday, April 28, 2024

పెరిగిన బంగారం ధర..తగ్గేదే లే అంటోన్న వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 22క్యారెట్లకి చెందిన 10గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి 48 వేల 200 రూపాయల వద్ద ఉంది. ఇటీవలి కాలంలో రూ.48 వేలకుపైగా చేరడం ఇదే తొలిసారి. వారం వ్యవధిలో గోల్డ్ రేటు ఏకంగా రూ.2 వేలకుపైగా పెరిగింది. నవంబర్ 4న రూ.46,100గా ఉండగా.. ఇప్పుడు 48 వేల 200 రూపాయలకు చేరింది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ. 430 పెరిగి 52 వేల 580 వద్ద ఉంది. ఇది కూడా అంతే మొత్తంలో పెరిగింది. వెండి రేట్లు కూడా ఇటీవల పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.67 వేల 500 వద్ద ఉంది. వారం వ్యవధిలో ఏకంగా రూ.3500 మేర ఎగబాకింది వెండి రేటు. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. ఇతర మార్కెట్లలో కూడా బంగారం, వెండి రేట్లు పెరుగుతున్నాయి. ఇవి అక్కడి పరిస్థితులను బట్టి, పన్నులను బట్టి రేట్లలో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా రేట్లు పెరుగుతుండటంతో ఇక్కడ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి.. రేట్లు అందుబాటు ధరల్లో ఉన్నప్పుడే ఈ విలువైన లోహాలను కొనుక్కోవడం మంచిది.ఇంకా బంగారం కొనుక్కునే ముందు హాల్‌మార్క్ చూసుకోవాలి. హాల్‌మార్క్ అనేది బంగారం స్వచ్ఛతను, నాణ్యతను నిర్ధరిస్తుంది. హాల్‌మార్క్‌ను ఎప్పటినుంచో కేంద్రం తప్పనిసరి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement