Friday, May 10, 2024

వైమానిక ప్రదర్శనలో దారుణం.. మంటల్లో కాలిన రెండు విమానాలు

వైమానిక ప్రదర్శనలో దారుణం జరిగింది. ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న రెండు విమానాలు పొరపాటున ఢీకొన్నాయి. ఓ విమానం గాల్లోనే పేలిపోగా.. మరో విమానం నేల కూలి మంటల్లో చిక్కుకుంది. ఈ సంఘటన అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని డాలస్ లో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో జరిగింది.. ఈ ప్రమాదంలో విమానాలను నడుపుతున్న పైలట్లతో సహా ఆరుగురు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో ఒకటి రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి విమానం కావడం గమనార్హం. వైమానిక ప్రదర్శనలో పాల్గొన్న బోయింగ్ బి-17 యుద్ధ విమానం, పీ-63 కింగ్ కోబ్రా విమానం రెండూ ఆకాశంలో విన్యాసాలు ప్రారంభించాయి. వైమానిక ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను తమ ఫోన్లలో వీడియోలు తీసుకుంటున్నారు. ఇంతలో బోయింగ్ బీ-17 విమానం వైపు వేగంగా దూసుకొచ్చిన కింగ్ కోబ్రా క్షణాలలో దానిని ఢీ కొట్టింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం, ఆపై కింగ్ కోబ్రా విమానం పేలిపోయింది. బోయింగ్ విమానం నేల కూలి మంటల్లో చిక్కుకుంది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ దుర్ఘటన మొత్తం సందర్శకుల ఫోన్లలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement