Sunday, December 10, 2023

ప్ర‌శాంత్ కిషోర్ అంటేనే ఓ బ్రాండ్ – రాజ‌స్థాన్ సీఎం ప్ర‌శంస‌లు

తాము ఏజెన్సీలు, విశ్లేష‌కుల నుంచి స‌ల‌హాలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్. ఈ సంద‌ర్భంగా వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌శాంత్ కిశోర్ అంటేనే ఓ బ్రాండ్ అని అన్నారు. వ్యూహ‌కర్త ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరుతున్న నేప‌థ్యంలో గెహ్లోత్ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. 2014 లో ఆయ‌న ప్ర‌ధాని మోడీ వెంట న‌డిచార‌ని, ఆ త‌ర్వాత సీఎం నితీశ్ వెంట ప‌య‌నించార‌ని గుర్తు చేశారు. నితీశ్ త‌ర్వాత పంజాబ్ కాంగ్రెస్ వెంట న‌డిచార‌ని తెలిపారు. ప్ర‌శాంత్ కిశోర్ అనుభ‌వం ప్ర‌తిప‌క్షాల‌న్నింటినీ ఏకం చేయ‌డానికి ఎంతో ఉప‌క‌రిస్తుంద‌ని గెహ్లోత్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇక దేశంలో జ‌రుగుతున్న హింసాకాండ‌పై కూడా గెహ్లోత్ స్పందించారు. దేశంలో ఏం జ‌రుగుతుందో తెలుస‌ని, సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని ఆరోపించారు. ఇలాంటి రాజ‌కీయాలు చాలా డేంజ‌ర్ రాజ‌కీయాల‌ని, ప్ర‌జ‌లు చాలా జాగ‌త్ర‌త్త‌గా ఉండాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement