Monday, April 29, 2024

కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే భేటీలో నటుడు ప్రకాశ్ రాజ్!

జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ముంబైలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అయ్యారు. అయితే, ఈ స‌మావేశానికి సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కూడా హాజ‌ర‌య్యారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో ప్రకాశ్ రాజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.  

నిజానికి సీఎం కేసీఆర్, నటుడు ప్రకాశ్ రాజ్ ల మధ్య మంచి సానిహిత్యం ఉంది. గతంలోనూ బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్నామ్యాయంగా కూటమిని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ చర్చలు జరిపిన సందర్భంలోనూ ప్రకాశ్ రాజ్ ఉన్నారు. జేడీఎస్ నేతలు మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలను కలిసి కేసీఆర్ కూటమి ఏర్పాటు అంశం గురించి చర్చించారు. ఆ సందర్భంలోనూ కేసీఆర్ వెంట నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు.  ప్రకాష్ సామాజిక అంశాలపై గట్టిగా స్పందిస్తుంటారు. తను బీజేపీ వ్యతిరేకిని అని కూడా గట్టిగా చెప్పుకుంటారు. ఈ నేఫథ్యంలో కన్నడ రాజకీయ నేతలతో కేసీఆర్ సమావేశంలో ప్రకాష్ రాజ్ కనిపించాడు.

కేవలం కన్నడ రాజకీయ నేతలతోనే కాకుండా తమిళ రాజకీయ నేతలతో కేసీఆర్ చర్చలకు ఇప్పుడు మధ్యవర్తి అవుతున్నాడట. ప్రకాష్ రాజ్ కన్నడ, తెలుగు, తమిళంలో నటుడిగా మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటులో మరోసారి కేసీఆర్ కి మద్దతుగా ప్రకాశ్ రాజ్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement