Sunday, April 28, 2024

ప్ర‌భాస్ చిత్రం కోసం వేరే టైటిల్ ఉంది – మారుతి

ద‌ర్శ‌కుడు మారుతి డైరెక్ష‌న్ లో యంగ్ హీరో ప్ర‌భాస్ న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. ఆ సినిమా టైటిల్ ‘రాజా డీలక్స్’ అనే టాక్ వచ్చింది. తాను చెప్పేవరకూ వెయిట్ చేయమని మారుతి స్పందించాడు కూడా. అయితే ఇది రవితేజ కోసం మారుతి అనుకున్న టైటిల్ అనేది తాజా సమాచారం. రవితేజతో మారుతి ఈ టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి వెళతాడన్న మాట. ఇక ప్రభాస్ తో చేయనున్న సినిమా టైటిల్ ను త్వరలోనే మారుతి ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ కి సంబంధించిన ఈ సినిమాకి టైటిల్ ను సెట్ చేసే పనిలోనే ఆయన టీమ్ ఉందట‌. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్ లు సందడి చేయనున్నార‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement