కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. సీనియర్ సిటిజన్లకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కలిగించింది సీఈసీ. 80ఏళ్లు దాటిన వారికి ఓట్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించింది సీఈసీ. కర్నాటకలో తొలిసారిగా సీఈసీ ఈ అవకావాన్ని కల్పించింది. దివ్యాంగులకు కూడా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశముంది. రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. 224 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగనున్నారు. ఏప్రిల్ 13న ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల 20. ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన, 24వరకు ఉపసంహరణ గడువు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
- Advertisement -
