Thursday, May 2, 2024

70 పులులను చంపిన వేటగాడు.. ‘టైగర్ హబీబ్‌’ దొరికాడు!

అంతరించిపోయే దశకు ఉన్న బెంగాల్ పులులను చంపినట్లు అనుమానిస్తున్న ఓ బంగ్లాదేశ్ వాసిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. వేట‌గాడు హ‌బీబ్ తాల్కూదెర్‌ ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గ‌డిచిన 20 ఏళ్ల‌లో సుమారు 70 పులుల‌ను అత‌ను చంపిన‌ట్లు భావిస్తున్నారు. హ‌బీబ్ తాల్కూదెర్‌ చాలామందికి ‘టైగర్ హబీబ్‌’గా సుపరిచితుడు. ఆయనపై ఇప్పటివరకు మూడు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.

ప‌శ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న సుందర్‌బన్ అడ‌వుల్లో హబీబ్ బెంగాల్ టైగర్స్‌ను చంపేసేవాడు. ఈ పులుల చర్మం, ఎముకలు, మాంసం ఇలా అన్నింటినీ బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తుంటారు. హబీబ్‌కు వాటి అమ్మకాల్లో సిద్ధహస్తుడిగా పేరుంది. టైగ‌ర్ హ‌బీబ్ కోసం పోలీసులు, అట‌వీశాక అధికారులు 20 ఏళ్లగా గాలిస్తున్నారు. సుందర్ బన్ స‌మీపంలో ఉన్న మాధ్యా సోనాటోలా గ్రామంలో అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. హబీబ్ చాలా కాలం నుంచీ పరారీలో ఉన్నాడని బంగ్లాదేశ్ పోలీసు విభాగం అధిపతి సైదుర్ రెహ్మాన్ చెప్పారు. కాగా, ప్రస్తుతం సుందర్‌ బన్ అడ‌వుల్లో ప్ర‌స్తుతం రాయ‌ల్ బెంగాల్స్ టైగ‌ర్స్ 114 ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement