Monday, April 29, 2024

ఎన్టీఆర్ చరణ్ పై భావోద్వేగ పోరాట సన్నివేశాలు…విజయేంద్ర ప్రసాద్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఓ యాక్షన్ సీన్ సినిమా మొత్తానికే అత్యంత భావోద్వేగ పూర్వకంగా ఉంటుందట. ఇద్దరు మంచి వ్యక్తులు ఒకరితో ఒకరు పోరాడితే ఎలా ఉంటుంది…!! అలాంటి వాళ్ళు ఒకరినొకరు కొట్టకోకూడదని అందరూ అనుకుంటారని అన్నారు. కాగా ఈ పోరాట సన్నివేశాలు కొమురంభీం, సీత రామ రాజు మధ్య అని అర్థం అవుతుంది. మరి యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement