Friday, April 19, 2024

మహేష్ త్రివిక్రమ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేక పోయినప్పటికీ… ఆ తర్వాత ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే చేసారేగాని ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ వంటి వివరాలను ఎక్కడ ప్రకటించలేదు.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ నే కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ గత రెండు చిత్రాలకు కూడా థమన్ మ్యూజిక్ ని అందించారు. ఆ రెండు చిత్రాల సాంగ్స్ కూడా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకి కూడా థమన్ కే ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఎక్కడా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement