Tuesday, May 7, 2024

టైఫూన్ పైట‌ర్ జెట్ లో విహ‌రించిన బ్రిట‌న్ ప్ర‌ధాని-వైర‌ల్ గా వీడియో

టైఫూన్ ఫైట‌ర్ జెట్ లో విహ‌రించారు బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్.జూలై 7వ తేదీన బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌దవి నుంచి బోరిస్ జాన్స‌న్ త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. కానీ క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నేత‌ను ఎన్నుకునే వ‌ర‌కు ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కాగా పైట‌ర్ సెట్ కి సంబంధించిన ఓ సెల్ఫీ వీడియోను కూడా ఆయ‌న పోస్ట్ చేశారు. డౌనింగ్ స్ట్రీట్ ఆ వీడియోను షేర్ చేసింది. మాస్క్ ధ‌రించి మ‌రీ ఫైట‌ర్ ప్లేన్‌లో టూర్ చేశారు. త‌న జెట్ వెంట వ‌స్తున్న మ‌రో రెండు విమానాల‌కు ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ థ‌మ్స‌ప్ సంకేతం కూడా ఇచ్చారు. లింక‌న్‌షైర్‌లో ఉన్న కొనింగ్స్‌బీ నుంచి టైఫూన్ ఫైట‌ర్ జెట్ కాక్‌పిట్‌లో బోరిస్ విహ‌రించారు. టైఫూన్ ఫైట‌ర్ జెట్‌కు సంబంధించి గ‌త వారం లింక‌న్‌షైర్‌లో ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. ఆ ప్ర‌ద‌ర్శ‌న‌కు హాజ‌రైన ప్ర‌ధాని బోరిస్‌.. ఫైట‌ర్ జెట్ టైఫూన్‌లో ఎగిరారు. ఓ ద‌శలో తాను ఆ జెట్‌ను పూర్తిగా కంట్రోల్‌లోకి తీసుకున్న‌ట్లు తెలిపారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement