Friday, April 26, 2024

పోల‌వ‌రం ప్రాజెక్టుతో తెలంగాణ‌కి ఇబ్బందే-మంత్రి పువ్వాడ‌

పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్ వ‌ల్ల ఎన్నో గ్రామాలు వ‌ర‌ద ముంపు బారిన ప‌డుతున్నాయ‌న్నారు మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్.
పోల‌వరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది కలుగుతోందనే మాట వాస్తవమేనని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఎన్నో ఈ డ్యామ్ వల్ల గోదావరి వరద ప్రవాహం నెమ్మదిగా వెళ్తోందని .. పోలవరం డ్యామ్ ఎత్తును తగ్గించాలని గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. భద్రాచలం పట్టణానికి వరద నుంచి శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1,000 కోట్ల రూపాయలను ప్రకటించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆకాశ మార్గాన కాకుండా రోడ్డు మార్గాన వచ్చి వరద బాధితులను కలిశారని చెప్పారు. వరద బాధితులను ముంపు ప్రాంతాల నుంచి తరలిస్తామని… వారికి శాశ్వత గృహాలను కట్టిస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కొనసాగిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement