Saturday, April 27, 2024

రిపేర్ చేస్తుండ‌గా పేలిన ఫోన్..త‌ర్వాత ఏం జ‌రిగింది..

ఫోన్ రిపేర్ చేస్తుండ‌గా స‌డెన్ గా పెద్ద శ‌బ్దంతో పేలింది..దాంతో మంట‌లు కూడా వ‌చ్చాయి. ఈ సంఘ‌ట‌న వియ‌త్నాంలో చోటు చేసుకుంది. అతను రిపేరర్ కాబట్టి… అలర్ట్‌గా ఉన్నాడు. ఫోన్ పేలగానే… దాన్ని జాగ్రత్తగా తీసి… షాప్ బయటకు విసిరేశాడు. అతను ఆలస్యం చేసి ఉంటే… పెద్ద అగ్ని ప్రమాదం జరిగేది. ఇప్ప‌టికే ఫోన్ లు పేలిన ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రిగాయి..ఫోన్ ఎందుకు పేలుతుందంటే..ఫోన్ బ్యాట‌రీల‌కు పేలే గుణం ఉంటుంది. అవి లీక్ అయినా, తయారీ దశలో క్వాలిటీ మెటీరియల్ వాడకపోయినా.. ఆ తర్వాత కాలంలో బ్యాటరీ ఉబ్బి… ఒక్కసారిగా పేలే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మనం మొబైల్స్ కొనుక్కునేటప్పుడు కాస్త రేటు ఎక్కువైనా బ్రాండెడ్‌వే కొనుక్కోవడం మంచిది. అందుకే మొబైల్స్‌ని పాకెట్లలో పెట్టుకోవద్దనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement