Saturday, May 4, 2024

ఏపీలో సెంచరీ దాటిన డీజిల్ ధర

కొన్నిరోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్ ధర ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సెంచరీ దాటేసింది. డీజిల్ ధర కూడా పెట్రోల్ బాటలోనే నడుస్తోంది. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో ఏపీలోని విజయవాడ, గుంటూరు నగరాల్లో డీజిల్ ధర రూ.100 దాటింది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.71 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.25 లకు లభిస్తోంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.71 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.100.25లకు లభిస్తోంది. విశాఖలో పెట్రోల్ ధర రూ.107.71 ఉండగా.. డీజిల్ ధర రూ.98.65గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.23లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.98.82గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.39 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.96గా ఉంది.

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా, లీటర్ డీజిల్ ధర రూ. 97.96గా ఉన్నాయి. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.54 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.67గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.94ఉండగా.. డీజిల్ ధర రూ.98.06 గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.97 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.08గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.43గా ఉండగా.. డీజిల్ ధర రూ. 98.50గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.51గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.59గా ఉంది.

ఈ వార్త కూడా తప్పకుండా చదవండి: ఆగస్టు నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement