Thursday, March 28, 2024

ఆగష్టు నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..ముందే జాగ్రత్త పడండి..

ఆగష్టు నెలలో నేలలో బ్యాంకు లావాదేవీలు చేసేవారు ముందస్తు జాగ్రత్త పడడం మంచిది. ఎందుకంటే ఆగస్టు నెలలో ఈసారి భారీగా సెలవులు ఉండబోతున్నాయి. జూన్, జులై నెలలో బ్యాంకు సెలవులు తక్కువనే ఉన్నాయి కానీ ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవు దినాలుగా ఉండటం గమనార్హం. దీంతో చెక్ క్లియరెన్స్, రుణాలు పొందేవాళ్లు మాత్రం బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది. సెలవులపై అవగాహన కలిగి ఉంటే మంచిది. ప్లానింగ్ సులువుగా ఉంటుంది. ఆగస్టు నెలలో ఉన్న సెలవులను ఒసారి పరిశీలిద్దాం..

ఆగష్టులో మొత్తం 31 రోజులు ఉండగా ఆగష్టు 1వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు దినంగా ఉంది. ఆగష్టు 8వ తేదీన కూడా రెండో ఆదివారం కావడంతో సెలవు దినంగా ఉంది. ఆగష్టు నెల 13వ తేదీన ఇంఫాల్ జోన్‌లో మాత్రం బ్యాంకు సెలవు కాగా మిగిలిన ప్రాంతాల్లో బ్యాంకులు పని చేస్తాయి. ఆగష్టు 14 రెండో శనివారం కాగా ఆగష్టు 15వ తేదీ ఆదివారం కావడం, స్వాతంత్ర దినోత్సవం కావడంతో సెలవు దినంగా ఉంది. ఆగష్టు 16వ తేదీ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో సెలవు దినంగా ఉంది. ఆగష్టు 19వ తేదీన మొహర్రం పండుగ సందర్భంగా సెలవుదినం కాగా ఆగష్టు 20వ తేదీన ఓనం కారణంగా సెలవు దినంగా ఉంది. ఆగష్టు 22 ఆదివారం సెలవు దినం కాగా ఆగష్టు 28 నాలుగో శనివారం సెలవుగా ఉంది. ఆగష్టు 29 ఆదివారం సెలవు కాగా ఆగష్టు 30 జన్మాష్టమి, ఆగష్టు 31 కృష్ణాష్టమి కావడంతో హైదరాబాద్ లో బ్యాంక్ సెలవుగా ఉంది.

ఇది కూడా చదవండి: భారత రెజ్లర్‌కు బంగారు పతకం

Advertisement

తాజా వార్తలు

Advertisement