Wednesday, February 8, 2023

కొండగట్టు అంజన్న సేవలో పవన్ కళ్యాణ్.. వారాహికి పూజలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకున్నారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వారాహికి పవన్ వాహన పూజ చేయించారు. ఈసందర్భంగా పవన్ ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కొండగట్టు కోలాహలంగా మారింది. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. కొడిమ్యాల మండలం నాచుపల్లిలో నేతలతో పవన్ సమావేశం ఉండనుంది. నారసింహా క్షేత్రాల సందర్శనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పవన్ పూజలు చేయనున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement