Thursday, May 2, 2024

Pawan kalyan: కేసీఆర్.. రాజ‌కీయ పోరాట యోధుడు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఆయనకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప వాక్ప‌టిమ, ముందు చూపు క‌లిగిన రాజ‌కీయ పోరాట యోధుడు కేసీఆర్ అని అన్నారు. ఎంత‌టి జ‌టిల‌మైన స‌మ‌స్య తెలంగాణ రాష్ట్రానికి ఎదురైనా త‌న మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌కు సాంత్వన చేకూర్చ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అని చెప్పారు. కేసీఆర్ రాజ‌కీయ ప్ర‌యాణం, తెలంగాణ సాధ‌న‌లో ఆయ‌న‌దైన పోరాటం కేసీఆర్‌ను తెలంగాణ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలుపుతుంద‌ని తెలిపారు.

రాష్ట్ర విభజన తరవాత హైదరాబాద్ తోపాటు తెలంగాణ అంతటా శాంతిభద్రతలు పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం విజ్ఞులందరితోపాటు నాకూ ఆనందాన్ని కలిగించిందన్నారు. నూతన వసంతంలోకి అడుగిడుతున్న శుభ తరుణంలో కెసిఆర్ కి సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్టును ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను ప‌వ‌న్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement