Sunday, April 28, 2024

పంజాబ్ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రాజీనామా

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పంజాబ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు చివరి దశకు చేరింది. కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్కు స్వయంగా అందించారు పీసీసీ అధ్యక్షుడు సిద్దూతో నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగానే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా పంజాబ్ కాంగ్రెస్ లో అమరేందర్ సింగ్ కు పిసిసి సిద్దు మధ్య వర్గ పోరు సాగుతోంది. ఇద్దరి మధ్య సయోధ్య కోసం పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ ప్రయత్నించారు. అయితే, రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఓవైపు ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ను బుజ్జగిస్తూనే మరోవైపు నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు పీసీసీ బాధ్యతలు అప్పజెప్పారు. తొలుత కెప్టెన్‌ అమరీందర్‌ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధూతో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. అయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు మారలేదు. ఈ పరిణామాలతో అమరీందర్‌ సింగ్‌ విసిగిపోయినట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement