Monday, April 29, 2024

PAN INDIA : భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పాన్-ఇండియా ట్రెండ్.. ఆ లైనప్‌లోనే అగ్ర హీరోలు..

భారతీయ చిత్రసీమ‌ వివిధ భాషా చిత్ర పరిశ్రమలతో ఉంటుంది. సాధారణంగా ఒక భాషలో తీసిన సినిమాని ఇతర భాషల్లోకి రీమేక్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు.. పాన్-ఇండియా ట్రెండ్ షురూ అయింది.. 1959లో డా.రాజ్‌కుమార్-నటించిన మహిషాసురమర్దిని కన్నడ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి విడుద‌లైన‌ మొదటి పాన్-ఇండియన్ సినిమా.. ఆ సినిమాని ఏడు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత నాలుగు భాషల్లో మరే సినిమా విడుదల కాలేదు. కాక‌పోతే.. తెలుగు, తమిళం సినిమాల‌ను హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం ఒక సాధారణ పద్ధతిగా మారింది. దాంతో తెలుగు.. తమిళ.. మళ‌యాళం సినిమాలకు చెందిన సినిమాలు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. అదేవిధంగా, హిందీ రిలీజ్ అయిన సినిమాలు కూడా తరుచుగా తెలుగు.. తమిళ భాషల్లోకి డబ్ చేయబడ్డాయి..

అయితే S. S. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి – ది బిగినింగ్ (2015).. బాహుబలి 2 (2017), భారతీయ సినిమా రూపురేఖలను మార్చాయి. ఈ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలయ్యాయి. చిత్ర నిర్మాతలు ఒక కొత్త చలనచిత్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. పాన్-ఇండియన్ సినిమాల‌ను మార్కెటింగ్ చేయడంలో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ రాణించిండం మొద‌లు పెట్టింది. ఆ త‌రువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం K.G.F – చాప్ట‌ర్ 1 (2018) ఈ సినిమా కూడా ఐదు భాషల్లో రిలీజ్ అయింది. కన్నడ సినిమా నుండి K.G. F మొదటి పాన్-ఇండియన్ చిత్రంగా నిలిచింది. అప్ప‌టి నుంచి భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో పాన్-ఇండియా ట్రెండ్ మొద‌లైంది.. వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో బాక్స్ ఆఫీస్ ద‌గ్గ‌ర రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.. టాలీవుడ్ నుంచి తాజాగా విడుద‌లైన రాధేశ్యామ్.. ఆర్.ఆర్.ఆర్ సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావ‌డంతో దేశవాప్తంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి క‌లెక్షన్ల‌ను రాబ‌డుతున్నాయి.. ఇప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయితే అది టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. అంటూ వేరు చేయ‌కుండా ఒక ఇండియ‌న్ సినిమాగా ఆద‌రిస్తున్నారు.. అయితే ఇప్పుడు భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వరుస పాన్-ఇండియా సినిమాల లైనప్ ఏర్ప‌డింది.. అవేంటో ఓ లుక్కేద్దాం..

రాబోయే పాన్ ఇండియా సినిమాలు ఇవే..

Ram charan – Shankar, Gautam, Prashanth neel, Sukkumar.

N.T.R – koratala shiva, Bucchi babu, Prashanth neel.

- Advertisement -

Allu Arjun – Sukumar (Pushpa 2).

Prabhas – Om Raut (Adipurush), Prashanth Neel (Salaar), Naag Ashwin (Project-K), Sandeep Reddy(Spirit), Maruthi(Raja Deluxe),

Mahesh Babu – S.S Rajamouli.

Vijay Devarakonda – Puri Jagannadh(Liger), Puri Jagannadh, Sukumar.

Ram Potineni – Boyapati Srinu.

Bellamkonda Srinivas – v.v vinayak.

Ravi Teja – Vamsi Krishna Akella (Tiger)

Nani – Srikanth Odela. (Dasara)

Adavi Sesh – Sashi Kiran Tikka (Major)

Vikram; Jayam Ravi; Karthi – Mani Ratnam (Ponniyin Selvan)

Ranbir Kapoor – Ayan Mukerji (Brahmastra Part One)

Pawan kalyan – Krish Jagarlamudi (Hari Hara Veera Mallu)

Samantha – Gunasekhar (Shaakuntalam)

Aamir Khan – Advait Chandan (Laal Singh Chaddha)

Kamal Haasan – Shankar (Indian 2)

Teja Sajja – Prashanth Varma (Hanuman)

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement