Tuesday, May 7, 2024

Breaking: కాంగ్రెస్ కు షాక్.. ఓయూలో రాహుల్ స‌భ‌కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించే సభపై ఉత్కంఠ నెలకొంది. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో స‌భ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాల‌న్న కాంగ్రెస్ పార్టీ విన‌తి తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ విన‌తిని త‌ర‌స్క‌రిస్తున్న‌ట్లు ఓయూ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. దీంతో సభ నిర్వహణ డైలామాలో పడింది.

కాగా, మే 6న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్న రాహుల్ గాంధీ.. అదే రోజున వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌వుతారు. ఆ మ‌రునాడు హైద‌రాబాద్‌లో ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. ఈ సంద‌ర్భంగా ఓయూలోనూ రాహుల్ గాంధీ కోసం ఓ స‌భ నిర్వ‌హిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ యూనివ‌ర్సిటీ అధికారుల‌ను కోరింది. అయితే, ఈ ప్ర‌తిపాద‌న‌పై సుధీర్ఘంగా ఆలోచ‌న చేసిన ఓయూ గ‌వ‌ర్నింగ్ కౌన్నిల్.. రాహుల్ గాంధీ స‌భ‌కు అనుమ‌తిని నిరాక‌రిస్తూ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. దీంతో సభ నిర్వహిస్తారా? లేదా? అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement