Wednesday, May 1, 2024

Spl Story | ఇదే నిజమైన రక్షా బంధం.. అవయవదానంతో ప్రాణాలు నిలిపిన సోదరీ సోదరులు!

రక్షా బంధన్​ అంటే అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు వారి తోబుట్టువులకు జీవితాంతం తోడుగా నిలుస్తామని, కష్ట సుఖాలలో అండగా ఉంటామని భరోసా ఇవ్వడమే. అయితే.. ఈ పండుగకు ఓన్లీ రాఖీ కట్టుకుని కానుకలు ఇవ్వడమే కాకుండా కొంతమంది ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. వారి మంచి మనసును చాటుకుని సమాజంలో తోటి వారికి స్ఫూర్తిని నింపుతున్నారు. తమ తోబుట్టువులు దీర్ఘకాలపు అనారోగ్యంతో బాధపడుతూ.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే వారికి కావాల్సిన అవయవాలను దానం చేసి మరో జన్మ ప్రసాదించారు. మూత్రపిండాలు, కాలేయం, కిడ్నీల వంటివి దానం చేసి రక్త బంధాన్ని నిలబెట్టుకున్నారు. ఇలాంటి స్ఫూర్తి వంతమైన ఘటనల సమాహారం ఈ ప్రత్యేక కథనం..

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

తోబుట్టువుల ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచేది రక్షా బంధన్. సోదరులు.. సోదరీమణులు తమ బంధాన్ని ఆచార వ్యవహారాలకు మించి విస్తరించడంతో ఈ సంవత్సరం ఓ స్ఫూర్తిదాయకమైన మలుపును చూడొచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా అసమానమైన ఆప్యాయతలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కొంతమంది తోబుట్టువులు రాఖీ యొక్క నిజమైన సారాన్ని తెలియజేసేలా అవయవ దానం యొక్క ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎంచుకున్నారు.

సాంప్రదాయకంగా రక్షా బంధన్ సమయంలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టడాన్ని చూస్తాం, చాలామంది వారి శ్రేయస్సును కోరుతూ ఆశీర్వదిస్తుంటారు.  ఏదేమైనా ఈ సారి తోబుట్టువులు నిస్వార్థంగా ఒకరి ప్రాణాలను మరొకరు రక్షించుకోవడానికి అవయవాలను దానం చేసిన కథలు పండుగ స్ఫూర్తికి స్వరూపంగా మారాయి. ఇలాంటి దాతృత్వ చర్యలు మూత్రపిండాల విరాళాల నుండి కాలేయ మార్పిడి వరకు ఉన్నాయి. ప్రతి కథనం తోబుట్టువుల ప్రేమ,  త్యాగానికి చెందిన అనురాగాన్ని తెలియజేసేలా ఉంది. 

- Advertisement -

తాపీ మేస్త్రీ గణేశ్​కు కొత్త జీవితం ప్రసాదించిన సోదరి..

విశాఖ పట్టణానికి చెందిన 35 ఏండ్ల తాపీ మేస్త్రీ గణేశ్​కు కిడ్నీ దెబ్బతింది.  దీంతో అతను డయాలసిస్​పై ఆధారపడి బతుకుజీవుడా అంటూ పోరాటం చేస్తున్నాడు. అయితే అతని అక్క 43 ఏళ్ల వయస్సులో ఉన్న చంద్రావతి.. విశాఖపట్నంలోని కిమ్స్-ఐకాన్ హాస్పిటల్‌లో తన కిడ్నీలలో ఒకదాన్ని గణేశ్​కు దానం చేసింది. తద్వారా అతని ప్రాణాలు కాపాడింది. అతనికి రక్షకురాలిగా మారింది. ఈ దానం అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది, ఆపరేషన్​ చేసిన వైద్య బృందం అతడి ప్రాణాలు కాపాడి ఆ కుటుంబానికి కొత్త వెలుగులు పంచారు..

రాయదుర్గంలో మరో ఘటన..

రాయదుర్గంలో ఉంటున్న 35 ఏళ్ల వీడియో ఎడిటర్ వీరభద్రకు.. తన చెల్లెలు గౌతమమ్మ (26 ఏళ్ల వయస్సులో)పై ఆశలు పెట్టుకున్నాడు. అతని కుడి కిడ్నీ తీవ్రంగా దెబ్బతినడంతో వీరభద్ర చెల్లెలు అనంతపురంలోని కిమ్స్ సవీరా హాస్పిటల్‌లో తన కిడ్నీని దానం చేయడానికి ముందుకు వచ్చింది.

హైదరాబాద్​లో బోటిక్​ యజమాని..

హైదరాబాద్‌కు చెందిన శీతల్ భండారీ అనే 43 ఏళ్ల బోటిక్ యజమాని కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఆమె తమ్ముడు 37 ఏళ్ల వయస్సున్న దుష్యంత్ హైదరాబాద్‌లోని ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో తన కిడ్నీని దానం చేశాడు. జీవితకాల రక్షణకు నమ్మకంతో పాతుకుపోయిన వారి కథ.. రాఖీ పండుగ యొక్క సారాంశాన్ని ప్రతిధ్వనిస్తుంది. వైద్య సిబ్బంది సపోర్టుతో ఈ ఆపరేషన్​ సక్సెస్​ అయ్యింది.  ఇప్పుడు కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది.

సిక్కింలో..

రివర్స్ సంజ్ఞలో సిక్కింకు చెందిన 60 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి అజిత్ శర్మ తన చెల్లెలు 56 ఏళ్ల వయసులో రాఖీ బహుమతిని అందుకున్నాడు. ఆమె కిడ్నీ అందజేయడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్స్ లోని వైద్యులు ఆపరేషన్​ చేశారు. దీంతో అతని ప్రాణాలు కాపాడినట్టు అయ్యింది. చిన్నప్పటి నుండి వారు పంచుకున్న విడదీయరాని బంధాన్ని ఈ దానంతో పునరుద్ఘాటించారు.

కాలేయం దానం చేసిన సోదరి..

సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనోహర్​ (47) కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. నిర్మల్‌కు చెందిన 43 ఏళ్ల సోదరి సంధ్యారాణి.. తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసింది. దీంతో తన అన్నయ్య మనోహర్‌కు అపూర్వమైన రాఖీ బహుమతిని అందజేసింది. ఇట్లా.. రాఖీ పండుగ ప్రాముఖ్యం, సాంప్రదాయ, ఆచారాలకు అతీతంగా తోబుట్టువులు తమ సోదరీ, సోదరుల ప్రాణాలను కాపాడుకున్నారు. ఒకరి శ్రేయస్సును కాపాడుకోవడానికి అసాధారణమైన అవయవ దానానికి సిద్ధపడ్డారు. ఇవన్నీ నిజమైన రక్షా బంధన్‌కు ప్రతీకలుగా నిలుస్తున్నాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement