Monday, April 29, 2024

NLG: మోత్కూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు.. కమిషనర్ నోటీసులు జారీ చేసినా…

మోత్కూర్, ఆగస్టు 30 (ప్రభ న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఓ పక్క రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతుండగా.. మెయిన్ రోడ్డు వెంట వ్యాపారులు తమ దుకాణాలను కూలగొట్టి వెనక్కి జరిగి కట్టుకుంటుండగా, మరోపక్క.. పాత నిర్మాణానికి మించి ముందుకు జరిగి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న సంఘటన పాత బస్టాండ్ గాంధీ విగ్రహం వెనక చోటుచేసుకుంది. భవన యజమాని ఎల్లంల వీరస్వామి రోడ్డు వెడల్పులో తన భవనాన్ని కూల్చుకోగా, గ్రామపంచాయతీ ఉన్నప్పుడే చేపట్టిన నిర్మాణాలకు విరుద్ధంగా, ప్రస్తుతం మున్సిపాలిటీగా మారినప్పటికీ పాత నిర్మాణానికి మరింత ముందుకు జరిగి 2 ఫీట్ల మేర అక్రమంగా గోడ నిర్మాణం చేస్తున్నారని కాలనీవాసులు గంధం శ్రీనివాసరావు, గంధం శ్రీధర్ లు మున్సిపల్ కమిషనర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

కమిషనర్ సదరు భవన యజమానికి సోమవారం నోటీసులు జారీ చేసి, మంగళవారం తమ సిబ్బందితో అక్రమ నిర్మాణాన్ని ఆపేందుకు సిబ్బందిని పంపగా, సదరు భవన యజమాని మున్సిపల్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగడంతో చేసేది ఏమీ లేక సిబ్బంది వెనుతిరిగినట్లు తెలిసింది. భవన యజమాని కేవలం అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే చర్యలు తీసుకోవడం లేదని, మున్సిపల్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement