Friday, May 3, 2024

TS: సభాపతికే మళ్లీ పట్టం కడతాం… వ్యాయామశాల అధ్యక్షుడు

బాన్సువాడ, ఆగస్టు 30, ప్రభ న్యూస్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ‌ అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డినే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తామని బాన్సువాడ వ్యాయామ‌శాల అధ్యక్షులు గురువు వినయ్ కుమార్ అన్నారు. శాసనసభాపతిని ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ బాన్సువాడ నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. బుధవారం సభాపతిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. నిరుపేదల పాలిట పెన్నిధిగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలను తన కష్టాలుగా భావించి రాత్రింబవళ్లు కష్టపడి పేద ప్రజలను ఆదుకుంటున్న ఆరాధ్య దేవుడని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఏ వర్గానికి చెందిన ప్రజలు వచ్చినా సరే సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ తనదైన శైలిలో ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు. 11వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు.

విద్యాపరంగా బాన్సువాడ పట్టణంలో నర్సింగ్ జూనియర్ కళాశాల తీసుకురావడం జరిగిందని అదేవిధంగా నియోజకవర్గంలో రూ.150 కోట్లతో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని ఆయన వివరించారు. ప్రతి కుల సంఘానికి 100 కోట్ల నిధులను ఇచ్చి సంఘ భవనాలను నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన మహా నాయకులని వినయ్ అభివర్ణించారు. నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఐదు కోట్ల రూపాయలు సొంత ఖర్చులతో కోచింగ్ సెంటర్లను ఏర్పాటుచేసి వారికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిన ఘనత పోచారం శ్రీనివాస్ రెడ్డికి కుటుంబ సభ్యులకే దక్కిందని ఆయన వివరించారు.

రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో బాన్సువాడ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి బహుమతిగా ఇస్తామని ఆయన అన్నారు. సభాపతికి నియోజకవర్గంలోని ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయని, సభాపతి పర్యటనలో ఏ గ్రామంకు వెళ్లినా మహిళలు మంగళ హారతులతో, కార్యకర్తలు పోచారం అభిమానులు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలుకుతున్నారని గుర్తు చేశారు . సభాపతి అంటే శాసనసభకు పరిమితమని గతంలో భావించేవారు. శ్రీనివాస్ రెడ్డి సభాపతిగా ఎన్నికైన నాటినుండి నేటి వరకు కూడా సభాపతిగా హుందాగా వ్యవహరిస్తూ తన నియోజకవర్గ ప్రజల బాగోగులను ప్రతినిత్యం తెలుసుకుంటూ తనకు ఖాళీగా ఉన్న సమయాన్ని వృధా చేయకుండా ప్రతినిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామీణ ప్రజల సమస్యలను పరిష్కరించిన ఏకైక సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అని తాము గర్వంగానే చెప్పుకోగలుగుతున్నామని గురువు వినయ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement