Saturday, May 4, 2024

Layoffs | ఒరాకిల్‌ల మరోసారి ఉద్యోగులకు ఉద్వాసన

ఆర్ధిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా టెక్నాటజీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. అనేక దిగ్గజ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులకు తొలగిస్తున్నాయి. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఒరాకిల్‌ మరోసారి ఉద్యోగులను తొలగించనుంది. ఈ సారి ఒరాకిల్‌ హెల్త్‌ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కంపెనీ కొన్ని జాబ్‌ ఆఫర్లను కూడా వెనక్కి తీసుకుంది. ఓపెనింగ్‌ పొజిషన్లను తగ్గించుకుంది.

ఇటీవల ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రికార్డ్స్‌ సంస్థ సెర్నెర్‌ను ఒరాకిల్‌ 28.3 బిలియన్‌ డాలర్లు వెచ్చింది కొనుగోలు చేసింది. అమెరికాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వెటరన్స్‌ ఆఫైర్స్‌ ఆఫీస్‌ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌లో పేషెంట్ల సమాచార నిర్వహణ కాంట్రాక్ట్‌ను సెర్నెర్‌ పొందింది. సెర్నెర్‌ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు రావడంతో ఈ ఆఫీస్‌ భాగస్వామ్యాన్ని నిలిపివేసింది. దీంతో ఒరాకిల్‌ ఆరోగ్య విభాగంలలోని సెర్నర్‌లో లేఆఫ్‌లు అమలు చేయవచ్చని వార్తలు వచ్చాయి. దీంతో సదు లేఆఫ్‌ జాబితాలోని ఉద్యోగులకు మిగిలిన సర్వీసుకు సంబంధించి

ఏటా నాలుగు వారాల వేతనానికి మరో వారం అదనంగా చెల్లించడంతో పాటు సెలవులకు సొమ్ము ఇవ్వనున్నారు. అమెరికా ఐరోపాలోని కార్యాలయాల్లో ఈ కోతలు ఉండొచ్చని భావిస్తున్నారు. భారత్‌లో ఉన్న ఉద్యోగుల విషయంలో ఎలాంటి సమాచారం రాలేదు. సెర్నెర్‌ మాజీ ఉద్యోగులు లింక్డిన్‌లో పోస్టులు పెట్టి సహచరులకు మద్దతు తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఒరాకిల్‌ సుమారు 3వేల మంది ఉద్యోగులను తొలగించింది. వ్యయ నియంత్రణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంది. దీంతో పాటు కంపెనీలో జీతాల పెంపు, పదోన్నతులను కూడా నిలిపివేసింది. ఒరాకిల్‌ భారత్‌ విభాగంలోనూ ఉద్యోగులను తొలగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement