Monday, April 29, 2024

War: ర‌క్ష‌ణ కోస‌మే ఉక్రెయిన్‌పై యుద్ధం.. మీడియాతో ప్రెసిడెంట్ పుతిన్‌

ఉక్రెయిన్‌పై బాంబులు, సైనిక దాడుల త‌ర్వాత ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫ‌స్ట్ టైమ్ మీడియా ముందుకొచ్చారు. ఆంక్ష‌ల‌పై శిఖ‌రాగ్ర స‌దస్సులో చ‌ర్చ జ‌రిగింది. పాల్గొన్న అధ్య‌క్షుడు పుతిన్ గ్లోబ‌ల్ ఎకాన‌మీలో తాము కూడా భాగ‌మేన‌ని, ర‌ష్యాను ర‌క్షించుకునేందుకు యుద్ధం చేయ‌క త‌ప్ప‌డం లేదన్నారు. అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీయ‌డం త‌మ ల‌క్ష్యం కాదని, మా భాగ‌స్వాములు అర్థం చేసుకోవాలని స్ప‌ష్టం చేశారు. అయితే.. ఉక్రెయిన్‌లోని కీవ్ న‌గ‌రంపై మూడుసార్లు ర‌ష్యా దాడులు చేసింది..

14 గంట‌ల వ్య‌వ‌ధిలోనే మూడోసారి ఎనిమిది ఫైట‌ర్ జెట్ల‌తో బాంబుల వ‌ర్షం కురిపించిన ర‌ష్యా.. ఈ సంద‌ర్భంగా యుద్ధానికి వ్య‌తిరేకంగా మాస్కోలో ఆందోళ‌న‌లు మిన్నంటాయి. వెంట‌నే దాడుల‌ను నిలిపివేయాల‌ని ప్ల‌కార్డుల‌తో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు ర‌ష్యా పౌరులు..

కాగా, ఉక్రెయిన్​పై యుద్ధం ఆపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్​లో సూచించినట్టు సమాచారం. ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులను పుతిన్​ మోడీకి వివరించినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement